కాఠ్మాండూ: ‘ఎవరెస్ట్ మ్యాన్’గా గుర్తింపు పొందిన నేపాలీ షెర్పా 31వసారి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం ఎవరెస్ట్‌ను అధిరోహించి, తన రికార్డును తానే బద్దలు కొట్టారు. మంగళవారం 55 ఏండ్ల కమి రిటా షెర్పా ఈ ఘనతను సాధించారు. ఎవరెస్ట్‌ను ఈయన కంటే ఎక్కువసార్లు ఎవరూ ఇప్పటివరకు ఎక్కలేదని సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ సంస్థ తెలిపింది.
‘ఆయన గురించి పరిచయ వాక్యాలు అక్కర్లేదు. ఆయన కేవలం జాతీయ పర్వతారోహక హీరో మాత్రమే కాదు.. ఎవరెస్ట్ శిఖరానికే అంతర్జాతీయ చిహ్నం’ అని ఆ సంస్థ కొనియాడింది. కమి రిటా వాణిజ్య యాత్రలో భాగంగా 1994లో మొదటిసారి ఎవరెస్ట్‌ను అధిరోహించారు.