ఢాకా: పదవీచ్యుతురాలైన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు కోర్టు ధిక్కరణ కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ఆ దేశ న్యాయస్థానం బుధవారం తీర్పు చెప్పింది. ఆమె లొంగిపోయిన లేదా అరెస్టయిన రోజు నుంచి ఈ శిక్షాకాలం అమలులోకి వస్తుందని పేర్కొంది.
పదవీచ్యుతురాలైన హసీనా 11 నెలల క్రితం గత ఏడాది ఆగస్టులో భారత్కు పారిపోయి తలదాచుకున్న తర్వాత బంగ్లాలో ఆమెపై వందలాది కేసులు నమోదయ్యాయి. అయితే ఓ కేసులో శిక్ష పడటం ఇదే తొలిసారి.