Russia | మాస్కో : రష్యా దేశం భూ కక్ష్యలోకి ఒక రహస్య వస్తువును పంపింది. అది సైనిక లేదా ప్రయోగాత్మక అంతరిక్ష కార్యకలాపాలకు చెందిన ఉపగ్రహాలై ఉండవచ్చునని ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇది క్రెమ్లిన్ ఈ ఏడాది చేపట్టిన మొదటి ప్రయోగమని, ఆ దేశ రక్షణ శాఖ ప్రయోజనాలకు ఉద్దేశించి ప్రయోగించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ ప్రయోగం ఏ ప్రయోజనం కోసం చేపట్టారన్న విషయాన్ని రష్యా వెల్లడించ లేదు. గూఢచారం కోసమే వాటిని ప్రయోగించి ఉంటారని భావిస్తున్నారు.