బెర్ని, జనవరి 18: లేజర్ ద్వారా పిడుగుల నుంచి రక్షించే అధునాతన లైటింగ్ రాడ్లను యూరప్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీన్ని స్విట్జర్లాండ్లో విజయవంతంగా పరీక్షించారు. ఈ లైటింగ్ రాడ్ 26 అడుగుల ఎత్తు మాత్రమే ఉన్నా.. సమర్థంగా పని చేస్తుంది. ఇప్పటివరకు ఉన్న లైటింగ్ రాడ్లు కొంత ప్రాంతం వరకే రక్షణ ఇవ్వగలవని, ఈ లేజర్ లైటింగ్ రాడ్లతో ఎక్కువ విస్తీర్ణానికి రక్షణ కల్పించవచ్చని పరిశోధకులు తెలిపారు.