ఎడిన్బర్గ్: మూత్ర పరీక్ష ద్వారా కాలేయ క్యాన్సర్‌ను గుర్తించే విధానాన్ని స్కాట్లాండ్కు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది ప్రపంచంలోనే మొదటిది. ఇంతకాలం క్యాన్సర్‌ను గుర్తించేందుకు అల్ట్రాసౌండ్ స్కాన్ లేదా సర్జరీ చేయాల్సి వచ్చేది. ఇటీవలి కాలంలో రక్త పరీక్ష ద్వారా కూడా క్యాన్సర్‌ను గుర్తిస్తున్నారు. మూత్ర పరీక్ష ద్వారా లివర్ క్యాన్సర్‌ను గుర్తించే విధానం మాత్రం ఇదే మొదటిది.
క్యాన్సర్ రిసెర్చ్ యూకే, బీట్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రిసెర్చ్ సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరీక్షను అభివృద్ధి చేశారు. ఎలాంటి పరికరాలను శరీరంలోకి పంపించకుండా చేయగలిగిన మొదటి క్యాన్సర్ పరీక్ష ఇదే.