వాషింగ్టన్, ఏప్రిల్ 1: భూమిపై దాదాపు 71 శాతం నీరు ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే, భూమి లోపల ఇంతకు మించి నీటి నిల్వలు ఉన్నట్టు చెప్తున్నారు శాస్త్రవేత్తలు. భూమి లోపల 440 మైళ్ల లోతులో రింగ్వుడైట్ అనే ఒక రాయిలో భారీగా నీటిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘రింగ్వుడైట్ అనే రాయి చాలా ప్రత్యేకమైనది. ఇది స్పాంజిలా ఉంటుంది.
ఈ రాయి నీటిని పీల్చుకుంటుంది. హైడ్రోజన్‌ను ఆకర్షిస్తుంది’ అని శాస్త్రవేత్త స్టీవ్ జాకబ్సెన్ తెలిపారు. ఈ రాయిలో ఒక శాతం నీరున్నా అది భూఉపరితలం మీద ఉన్న మొత్తం నీటి కంటే 3 రెట్లు ఎక్కువ ఉన్నట్టు భావించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.