ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలున్నాయి. ప్రతిరోజూ ఏదో ఒకచోట కొత్త విషయాలు వెలుగు చూస్తుంటాయి. తాజాగా, యూనివర్సిటీ ఆఫ్ మియామీకి చెందిన శాస్త్రవేత్తల బృందం ఎర్ర సముద్రం దిగువన డెత్పూల్ను గుర్తించింది. ఈ ఉప్పునీటి కొలను 10 అడుగుల పొడవుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇది చాలా సముద్ర జీవులు, మానవులకు ప్రాణాంతకమని కనుగొన్నారు.
శాస్త్రవేత్తల బృందంలో ఒకరైన ప్రొఫెసర్ సామ్ పుర్కిస్ మాట్లాడుతూ, ఉప్పునీటి కొలనులో ఆక్సిజన్ లేదని, ఏదైనా సముద్ర జీవి ఇందులో ప్రవేశించగానే వెంటనే చనిపోతుందని తెలిపారు. రిమోట్‌తో ఆపరేట్ చేసే అండర్ వాటర్ వెహికిల్ (ఆర్ఓవీ)ని ఉపయోగించి 1,770 మీటర్ల లోతులో ఉన్న కొలనును పరిశోధకుల బృందం కనుగొన్నది. ఈ ఆవిష్కరణ మిలియన్ల సంవత్సరాల క్రితం మన భూమి మీద మహాసముద్రాలు ఎలా ఏర్పడ్డాయో కనుగొనేందుకు భవిష్యత్తులో తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.