న్యూయార్క్, ఆగస్టు 13: అంగారక గ్రహంపై నివాసయోగ్యతను గుర్తించేందుకు జరుగుతున్న పరిశోధనల్లో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. జీవుల మనుగడకు కీలకమైన నీటిజాడలను అంగారకగర్భంలో పరిశోధకులు గుర్తించారు. ఈ గ్రహం ఉపరితలానికి 20 కిలోమీటర్ల లోతులో నీటి జాడలు ఉన్నట్టు నాసాకు చెందిన మార్స్ ఇన్సైట్ ల్యాండర్ డాటాలో వెల్లడైంది.
ఈ ల్యాండర్‌ను 2018లో అంగారక గ్రహంపైకి పంపారు. నాలుగేండ్లుగా ఇది అక్కడి సిస్మిక్ డాటాను నమోదు చేస్తున్నది. ఈ డాటాను పరిశీలించిన పరిశోధకులు.. అంగారక ఉపరితలం నుంచి 11.5 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల లోతు వరకు నీటి జాడలు ఉన్నట్టు భావిస్తున్నారు. ఉపరితలం నుంచి లోపలికి నీరు వెళ్లి ఇంకిపోయి ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు.