లండన్: వాతావరణ మార్పులతో మంచు కరిగి, దాని కింద వేల ఏండ్లుగా అచేతన స్థితిలో ఉన్న వైరస్లు చేతన స్థితికి వస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తాజాగా, 48,500 ఏండ్ల నాటి జాంబీ వైరస్లను రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ పరిశోధకుల బృందం గుర్తించింది. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో వేల ఏండ్లుగా మంచు కింద ఉన్న 24 వైరస్లను వెలికి తీశారు. అందులో ఓ సరస్సు అడుగు భాగంలో గడ్డ కట్టి ఉన్న వైరస్ కూడా ఉన్నది. ఈ వైరస్లలో 13 కొత్త జాతులను గుర్తించామని, వాటికి జాంబీ వైరస్ అని పేరు పెట్టినట్టు వెల్లడించారు. ఇలాంటి ప్రాణాంతక వైరస్లు లక్షల ఏండ్లుగా మంచు కింద బందీ అయినవి అనేకం ఉన్నాయని వివరించారు. మంచు కరిగితే అవి వాతావరణంలో కలిసి, మానవాళిపై దాడి చేసి, పెను ప్రమాదాన్ని సృష్టిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.