ఇస్లామాబాద్: ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతుండగా సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం నుంచి మంటలు, పొగలు వెలువడ్డాయి. (Saudi flight catches fire) దీంతో ఎమర్జెన్సీ ద్వారం ద్వారా ప్రయాణికులను కిందకు దించారు. ఆ విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. పాకిస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. 297 మందితో ప్రయాణించిన సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం గురువారం పాకిస్థాన్‌లోని పెషావర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా మంటలు చెలరేగాయి. రియాద్ నుంచి పెషావర్ చేరుకున్న ఆ విమానం ల్యాండింగ్ గేర్‌లో సమస్య తలెత్తింది. దీంతో ఒక టైర్ నుంచి పొగలు వ్యాపించాయి.
కాగా, దీనిని గమనించిన ఏటీసీ సిబ్బంది పైలట్‌ను అప్రమత్తం చేశారు. ఆ విమానాన్ని వెంటనే రన్‌వే వద్ద నిలిపివేశారు. ఎమర్జెన్సీ డోర్ ద్వారా ప్రయాణికులను కిందకు దించారు. 276 మంది ప్రయాణికులు, 21 మంది సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. విమానం వద్దకు చేరుకున్న ఫైర్ సిబ్బంది పొగలను నియంత్రించారు. ఈ సంఘటనను సౌదీ ఎయిర్‌లైన్స్ ధృవీకరించింది. విమానం ఎమర్జెన్సీ డోర్ నుంచి ప్రయాణికులు దిగుతున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Saudi Airline’s plane ✈️ got fire at Peshawar airport, safety protocols are activated. pic.twitter.com/iuxq6mmxjd
— فرحان الحق کیانی (@Farhan_Kiyani) July 11, 2024