వాషింగ్టన్: సౌరకుటుంబంలో అందమైన గ్రహం ఏమిటంటే శనిగ్రహం అని చెబుతాం. చుట్టూ ఉన్న వలయాకార రింగులే దానికి అంత సౌందర్యాన్ని తీసుకొచ్చాయి. అయితే, రానున్న రోజుల్లో ఆ వలయాలు మాయం కానున్నట్టు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.
శనిగ్రహం చుట్టూ ఉన్న వలయాకార రింగుల్లో రాళ్లు, మంచు, దుమ్ము-ధూళి ఉంటుంది. అయితే గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో ఆ రాళ్లు, మంచు గడ్డలు క్రమంగా శనిగ్రహం ఉపరితలంపై పడిపోయి ఆవిరిగా మారుతున్నట్టు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.