టోక్యో, అక్టోబర్ 21: జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి చరిత్ర సృష్టించారు. మంగళవారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో తకైచి కూటమికి భారీ మద్దతు లభి ంచింది. 64 ఏండ్ల తకైచిని జపాన్ ఐరన్ లేడీగా అభివర్ణిస్తారు. ఐదేండ్లలో నలుగురు ప్రధానులు మారిన జపాన్లో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) సంక్షోభంలో చిక్కుకుపోయింది.
పార్టీ అంతర్గత కలహాల కారణంగా ప్రధాని షిగెరు ఇషిబా రాజీనామా చేయడంతో అతివాద నేతగా పేరొందిన 64 ఏండ్ల తకైచి పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. జపాన్ పార్లమెంట్లో జరిగిన ఎన్నికలో ఆమె భారీ మెజారిటీతో విజయం సాధించడంతో జపాన్ తొలి మహిళా ప్రధానిగా రికార్డు సృష్టించారు.