Iran | భారత్‌ను చూసి సభ్యత నేర్చుకోండి.. అమెరికా విదేశాంగ మంత్రికి ఇరాన్ సూచన
Iran | నాలుగు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా విదేశాంగ మంత్రి (US foreign minister) మార్కో రూబియో (Marco Rubio) భారత్ (India) కు చేరుకున్నారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఆయన భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం (Iran consulate).. అమెరికా మంత్రికి చురకలు అంటిస్తూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టింది.
Iran : నాలుగు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా విదేశాంగ మంత్రి (US foreign minister) మార్కో రూబియో (Marco Rubio) భారత్ (India) కు చేరుకున్నారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఆయన భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం (Iran consulate).. అమెరికా మంత్రికి చురకలు అంటిస్తూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టింది. భారతీయులలో సభ్యత కనిపిస్తుందని, వారి నుంచి కొంచెమైనా సభ్యతను అమెరికా నేర్చుకోవాలని సూచించింది. యుద్ధం ముగింపు చర్చలు కొనసాగుతున్న క్రమంలో అగ్రరాజ్యానికి చెందిన కొందరు నేతలు ఇరాన్‌తో ప్రవర్తిస్తున్న తీరు నేపథ్యంలో ఆ దేశ కాన్సులేట్ ఈ పోస్టు చేసింది.
తన పర్యటనలో భాగంగా తొలుత కోల్‌కతా చేరుకున్న అమెరికా మంత్రి మార్కో రూబియో అక్కడ మదర్ థెరెసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీని సందర్శించారు. అనంతరం ఢిల్లీలోని ‘సేవా తీర్థ్’ లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఆదివారం విస్తృత చర్చలు జరపనున్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆయన హాజరుకానున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- India
- iran
- Marco Rubio
- Sabhyata
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

