మికోలైవ్: ఉక్రెయిన్లోని దక్షిణ నగరం మికోలైవ్పై రష్యా రాకెట్లతో దాడి చేసింది. అయితే ఓ బహుళ అంతస్తుల బిల్డింగ్ ఆ రాకెట్ దాడికి ధ్వంసమైంది. బిల్డింగ్ మధ్య భారీ రంధ్రం ఏర్పడింది. ఉక్రెయిన్ అధికారులు ఆ ప్రాంతాన్ని సీజ్ చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న 17 మందిని రక్షించినట్లు ఆ నగర మేయర్ తెలిపారు. బిల్డింగ్కు చెందిన ఫోటోను సిటీ గవర్నర్ విటాలీ కిమ్ పోస్టు చేశారు. బిల్డింగ్ శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్లు విటాలీ తెలిపారు. రాకెట్ దాడితో సగం బిల్డింగ్ ధ్వంసమైనట్లు చెప్పారు.