మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌లో పుతిన్ సిబ్బందికి కరోనా వైరస్ సంక్రమించినట్లు తెలిసిందే. దీనిపై ఇవాళ పుతిన్ స్పందించారు. తన చుట్టు ఉన్నవారిలో డజన్ల సంఖ్యలో మందికి కరోనా వైరస్ సోకినట్లు ఆయన తెలిపారు. ఈ కారణంగానే సెల్ఫ్ ఐసోలేషన్‌లో వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే వీడియో లింకుల ద్వారా ఆయన సమావేశాలకు హాజరకానున్నట్లు క్రెమ్లిన్ ఓ ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రధాన మీటింగ్‌లన్నీ ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నారు. ఏప్రిల్‌లోనే స్వదేశీ స్పుత్నిక్ టీకాను పుతిన్ వేసుకున్న విషయం తెలిసిందే.