మాస్కో: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని తొలగించి అధికార మార్పిడి చేపట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ సైనిక బలగాలను రష్యా సైన్యం సమూలంగా అంతం చేస్తుందని ఆయన ప్రకటించారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరుపుతున్న వేళ పుతిన్ నుంచి ఈ ప్రకటన వెలువడడం ప్రాధాన్యతను సంతరించుకుంది.