అంకారా: రష్యా విమానంలో మంటలు చెలరేగాయి. (Russian plane catches fire) ఈ నేపథ్యంలో అందులోని ప్రయాణికులు, సిబ్బంది భయాందోళన చెందారు. అయితే ఎమర్జెన్సీ డోర్ ద్వారా వారు బయటపడ్డారు. దీంతో వారికి ముప్పు తప్పింది. టర్కీలోని అంటాల్య విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. రష్యాలోని అజిముత్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సుఖోయ్ సూపర్‌జెట్ ప్యాసింజర్ విమానం గాలి దుమారానికి ప్రభావితమైంది. దీంతో అంటాల్య విమానాశ్రయంలో ల్యాండింగ్ సందర్భంగా విమానం ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి.
కాగా, ఆ విమానంలోని 89 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటపడ్డారు. దీంతో వారికి ప్రమాదం తప్పింది. ఫైర్ కంట్రోల్ వాహనాలు ఆ విమానం వద్దకు చేరుకున్నాయి. మంటలను ఆర్పివేశాయి.
మరోవైపు రష్యా ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ రోసావియాట్సియా ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టింది. కాగా, విమానంలో మంటలు చెలరేగిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Fire on Sukhoi Superjet 100 at Antalya Airport :
• Russian-made plane with 89 passengers & 6 crew catches fire after hard landing
• Fire quickly contained; no injuries reported
• Passengers criticized for taking hand luggage during evacuation#Russia pic.twitter.com/OntEhQAcM7
— Smriti Sharma (@SmritiSharma_) November 25, 2024