కీవ్: ఉక్రేయిన్‌పై దాడిని రష్యా కొనసాగిస్తున్నది. (Russian missile attack) సోమవారం ఉక్రేయిన్ రాజధాని కీవ్‌తో సహా ఐదు నగరాలపై క్షిపణులు ప్రయోగించింది. 40కు పైగా మిస్సైల్ పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించినట్లు ఆ దేశ మంత్రి తెలిపారు. పలు అపార్ట్మెంట్స్, మౌలిక సదుపాయాలతోపాటు కీవ్‌లోని ఓఖ్మాట్డిట్ పిల్లల ఆసుపత్రి కూడా ధ్వంసమైనట్లు చెప్పారు. రష్యా దాడిలో సుమారు 20 మంది మరణించగా 50 మందికిపైగా గాయపడినట్లు వెల్లడించారు. ఆసుపత్రి శిథిలాల కింద చిన్నారులు చిక్కుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
Childerns Hospital Hit
కాగా, రష్యా తాజా దాడిపై ఉక్రేయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మండిపడ్డారు. 40కుపైగా రష్యా క్షిపణులు ఐదు నగరాల్లో విధ్వంసం సృష్టించాయని తెలిపారు. ‘ప్రపంచం ఇప్పుడు మౌనంగా ఉండకూడదు. రష్యా ఏమి చేస్తుందో అన్నది ప్రతి ఒక్కరూ చూడటం చాలా ముఖ్యం’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.