ఖార్కివ్: ఉక్రెయిన్లోని రెండో అతి పెద్ద నగరమైన ఖార్కీవ్లోని ఒక శిశు పాఠశాలపై రష్యా బుధవారం డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు మరణించగా, ఏడుగురు గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు.
దాడితో మంటల్లో చిక్కుకున్న కిండర్గార్టెన్ భవనం నుంచి పిల్లలను భుజాన వేసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు పోలీసులు, సిబ్బంది పరుగులు తీస్తున్న వీడియోను ఉక్రెయిన్ విదేశాంగ శాఖ షేర్ చేసింది.