Dima Nova | తన పాటతో పుతిన్‌పై వ్యతిరేకత వ్యక్తం చేసిన రష్యన్ పాప్ స్టార్ మృతి
Dima Nova | రష్యా అధ్యక్షుడు (Russia President) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)ను తన పాటలతో విమర్శించిన రష్యన్ పాప్‌స్టార్ (Rissian Popstar) దిమా నోవా (35) (Dima Nova) మృతి చెందాడు. అతను ఓ నదిని దాటుతుండగా మంచులో కూరుకుపోయి మృతి చెందినట్టు ‘న్యూయార్క్ పోస్ట్’ ( New York Post) తెలిపింది.
Dima Nova | రష్యా అధ్యక్షుడు (Russia President) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)ను తన పాటలతో విమర్శించిన రష్యన్ పాప్‌స్టార్ (Rissian Popstar) దిమా నోవా (35) (Dima Nova) మృతి చెందాడు. ఉక్రెయిన్‌పై (Ukraine) యుద్ధం మొదలుపెట్టిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. సైనికుల కుటుంబీకులు, సెలబ్రిటీలు, ఇతర దేశాధినేతలు, రష్యన్ ప్రజలు సైతం పుతిన్ చర్యపై పలు రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇటీవల రష్యాకు చెందిన కొందరు అనుమానాస్పదంగా మృతి చెందారు కూడా. వారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. ఇంతలోనే పుతిన్‌పై తన పాటలతో వ్యతిరేకత వ్యక్తం చేసిన దిమా నోవా (Dima Nova) ప్రాణాలు కోల్పోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
అతను ఓ నదిని దాటుతుండగా మంచులో కూరుకుపోయి మృతి చెందినట్టు ‘న్యూయార్క్ పోస్ట్’ ( New York Post) తెలిపింది. దిమా నోవా (Dima Nova) అసలు పేరు దిమిత్రి స్విర్గునోవ్ (Dmitry Svirgunov). ‘క్రీమ్ సోడా’ (Cream Soda) అనే పాపులర్ ఎలక్ట్రానిక్ గ్రూప్‌ను (founder of the popular electronic group) స్థాపించాడు. ఈ నెల 19న తన సోదరుడు, ముగ్గురు స్నేహితులతో కలిసి గడ్డకట్టిన వోల్గా నది (frozen Volga River)ని దాటుతుండగా మంచులో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. మంచుకింద చిక్కుకున్న అతడి స్నేహితులు ఇద్దరినీ రక్షించగా, మరో స్నేహితుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని నిరసిస్తూ దిమా నోవా తరచూ తన పాటలతో పుతిన్‌ను విమర్శించేవాడు. రష్యాలో జరిగిన యుద్ధ వ్యతిరేక నిరసనల సమయంలో అతడి సంగీతాన్ని ఒక గీతంలా ఉపయోగించేవారు. చాలా పాపులర్ అయిన, వివాదాస్పద పాట ‘ఆక్వా డిస్కో’. రష్యాలో ఆందోళనల సమయంలో ఈ పాటను ఎక్కువగా ఆలపించేవారు.
Also Read..
QR Code | సమాధిపై క్యూఆర్ కోడ్.. కుమారుడి జ్ఞాపకాలు సజీవంగా భద్రపరిచిన తల్లిదండ్రులు
Self Employment | కరోనా తర్వాత మారిన ఆలోచనలు.. జాబ్ కంటే స్వయం ఉపాధిపైనే యువత ఇంట్రెస్ట్
Mukesh Ambani | మళ్లీ ముకేశే నెం.1.. ఇండియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచిన అంబానీ
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

