ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు రష్యాను తప్పుబడుతూ ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌కు పలుదేశాలు మిలటరీ ఆయుధాలను కూడా పంపుతున్నాయి. అయితే ఇలా చేయడం సరికాదని, దీని వల్ల ఇతర అణుశక్తి కలిగిన దేశాలతో రష్యా పోరాడాల్సి వస్తుందని మాస్కో వర్గాలు హెచ్చరికలు కూడా చేశాయి.
తమ దేశంలోని స్ట్రాటజిక్ న్యూక్లియర్ శక్తులను హై అలర్ట్‌లో ఉంచామని రష్యా అధ్యక్షుడు పుతిన్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. దీనిపై రష్యా ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్‌ను ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. పుతిన్ అణు ఆయుధాలు వాడతారని అనుకుంటున్నారా? అని విలేకరి పలుమార్లు అడగడంతో పెదవి విప్పిన పెస్కోవ్.. తమ దేశం ఉనికికి ప్రమాదం ఏర్పడే స్థితిలో అణ్వాయుధాలు వాడతామని పెస్కోవ్ స్పష్టం చేశారు.
ఈ ఆయుధాలను ఎప్పుడు వాడాలో తమ వద్ద నియమావళి ఉందని, దాన్ని అనుసరించే వాటిని వాడతామని తెలిపారు. దీనిపై అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ.. న్యూక్లియర్ ఆయుధాలపై రష్యా వ్యాఖ్యలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.