Russia | మాస్కో: అజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమానం నైరుతి కజకిస్థాన్లో బుధవారం కూలిపోవడానికి కారణం రష్యా క్షిపణి అయి ఉండవచ్చునని బ్రిటన్లోని స్వతంత్ర సంస్థ ఓస్ప్రే ఫ్లైట్ సొల్యూషన్స్ చెప్పింది. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించిన క్షిపణి కారణంగానే ఈ విమానం కూలిపోయి ఉండవచ్చునని తెలిపింది. ఈ సంస్థ చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మట్ బోరీ మాట్లాడుతూ, ఈ విమానం శిథిలాలకు సంబంధించిన వీడియోను పరిశీలించినపుడు విధ్వంసక చర్య జరిగినట్లు సంకేతాలు వస్తున్నాయన్నారు.
రష్యాలోని స్వతంత్ర మీడియా సంస్థ మెడుజ కూడా ఇదే అనుమానం వ్యక్తం చేసింది. ఉపరితలం నుంచి ప్రయోగించిన క్షిపణి ప్రభావం ఈ విమానం తోక భాగంపై పడినట్లు కనిపిస్తున్నదని పేర్కొంది.