Russia | ఆ దేశాల నుంచి ఆయుధాలు కొనే యోచనలో రష్యా.. వాణిజ్య నౌకల్లో రవాణా చేస్తున్నారా?
ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన తర్వాత పాశ్చాత్య దేశాలన్నీ రష్యాపై ఆంక్షలు విధించాయి. అదే సమయంలో ఉక్రెయిన్‌కు అవన్నీ మద్దతుగా నిలిచాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా భారీగా ఆయుధాలు, ఆర్థిక సహకారం అందించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో యుద్ధాన్ని కొనసాగించేందుకు రష్యా చాలా కష్టపడుతోందని అమెరికా వర్గాలు చెప్తున్నాయి.
తమ వద్ద ఆయుధాలు అయిపోవడంతో విదేశాల నుంచి కొనుగోలు చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని, దీనికోసం వాణిజ్య నౌకలను ఉపయోగించుకుంటోందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సిరియాలో రష్యాకు చెందిన నౌకాశ్రయం నుంచి ఇటీవలే ఒక వాణిజ్య నౌక రష్యా చేరుకుంది. దీనిలో మిలటరీ ఆయుధాలే ఉన్నాయని పలు ఆరోపణలు వస్తున్నాయి.
టర్కీ మీదుగా ఈ నౌకలు వచ్చినప్పటికీ వాటిని ఆ దేశం అడ్డుకోలేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలవగానే.. తమ జలాల మీదుగా మిలటరీ నౌకలు వెళ్లకుండా టర్కీ ఆంక్షలు విధించింది. అయితే వాణిజ్య నౌకలకు ఎటువంటి అడ్డంకులు కల్పించలేదు. దీన్ని రష్యా క్యాష్ చేసుకొని వాణిజ్య నౌకల్లో ఆయుధాలు తెచ్చుకుంటోందని పాశ్చాత్య దేశాలు వాదిస్తున్నాయి.
అయితే ఈ విషయంపై రష్యా నుంచి ఎటువంటి వివరణ రాలేదు. ఇటీవల అమెరికా అధికారులు మాట్లాడుతూ.. ఇరాన్ నుంచి ఆయుధాలు కొనేందుకు రష్యా ప్రయత్నిస్తోందని చెప్పారు. రష్యా వద్ద ఉన్న ఆయుధాల నిల్వలు కరిగిపోతున్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని వాళ్లు అంటున్నారు.
అయితే సిరియా నుంచి ఆయుధాలు తెచ్చుకోవడంతోపాటు ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాల వద్ద నుంచి మిలటరీ ఆయుధాలు కొనుగోలు చేసేందుకు రష్యా ప్లాన్ చేస్తోందట. ఇటీవల రష్యా ఆక్రమించిన డోనెస్క్, లుషాంక్ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా ఉత్తర కొరియా గుర్తించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

