Russia | ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. హైపర్సోనిక్ ఒరెష్నిక్ ఆయుధాన్ని ప్రయోగించిందా..?
Russia : రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఉక్రెయిన్‌పై రష్యా ఆదివారం భీకర దాడులకు దిగింది. ఈసారి అత్యంత ఆధునికమైన, శక్తివంతమైన హైపర్ సోనిక్ ఆయుధాన్ని ప్రయోగించినట్లు తెలుస్తోంది.
Russia : రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఉక్రెయిన్‌పై రష్యా ఆదివారం భీకర దాడులకు దిగింది. ఈసారి అత్యంత ఆధునికమైన, శక్తివంతమైన హైపర్ సోనిక్ ఆయుధాన్ని ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రాత్రిపూట మిస్సైల్స్, డ్రోన్ల దాడితో రష్యా విరుచుకుపడింది. ఈ దాడుల్లో నగరంలో భారీ నష్టం జరగగా, ఇద్దరు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. పట్టణంలోని స్కూళ్లు, నివాస బిల్డింగులు, మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలపై ఈ దాడి జరిగిందన్నారు.
ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. రష్యా తన వద్ద ఉన్న అత్యాధునిక హైపర్ సోనిక్ మిస్సైల్ ప్రయోగించినట్లు జెలెన్స్కీ ఆరోపించారు. ఇతర మిస్సైళ్లు, డ్రోన్లతోపాటు ఒరెష్నిక్ మిస్సైల్‌ను కూడా ప్రయోగించిందని జెలెన్స్కీ ఆరోపించారు. వివిధ రకాల 90 మిస్సైల్స్ ప్రయోగించిందని, అందులో 36 బాలిస్టిక్ మిస్సైల్స్ కూడా ఉన్నాయని జెలెన్స్కీ అన్నారు. అలాగే, 600 డ్రోన్లు ప్రయోగించిందన్నారు. అయితే, వాటిలో చాలా వరకు తాము అడ్డుకోగలిగామని వెల్లడించారు. ఉక్రెయిన్‌లోని మిలిటరీ కమాండ్ సెంటర్లు, ఎయిర్ బేస్‌లు, రక్షణ శాఖ స్థావరాలపై దాడి చేశామని రష్యా రక్షణ శాఖ మంత్రి వెల్లడించారు. ఇటీవల రష్యాలోని నివాస స్థలాలపై ఉక్రెయిన్ దాడి చేయడం వల్లే తాము ప్రతిదాడులు చేశామని రష్యా తెలిపింది.
Since last night, first responders and all necessary services have been working wherever needed. As of now, at least 83 people have been confirmed injured since midnight. Tragically, there are fatalities. My condolences to the families and loved ones.
It was a heavy attack – 90… pic.twitter.com/KSB4IoxQaE
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) May 24, 2026
హైపర్సోనిక్ ఒరెష్నిక్ మిస్సైల్ ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ మంత్రి కూడా అంగీకరించారు. ఇది చాలా శక్తివంతమైనది. దాదాపు 3,000 కిలోమీటర్ల నుంచి 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా చేధించగలదు. ఇది శబ్దవేగంకంటే పది రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. దీన్ని మొదట 2002లో, ఆ తర్వాత 2025లో ప్రయోగించింది. ఇవి చాలా ప్రభావవంతమైనవి కావడంతో ఉక్రెయిన్‌కు భారీ నష్టం కలిగినట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Bus Fare | కర్ణాటకలో ఆర్టీసీ చార్జీల బాదుడు.. నవంబర్ 5 నుంచి కొత్త రేట్లు!
Trump Warning | 10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
Personal Finance Tips | పొదుపే శ్రీరామరక్ష.. అప్పుల ఊబిలో పడకుండా ఉండేందుకు ఈ పొదుపు అలవాట్లు మొదలుపెట్టండి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ఎలిమినేషన్.. రోహిత్‌కు షాకిచ్చిన హౌస్ మేట్స్ ఓటింగ్..!
Teachers Dress Code | ఇకపై టీచర్లు జీన్స్, టీషర్టులు వేసుకోవద్దు.. బీహార్ సర్కార్ సంచలన ఆదేశాలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

