Teachers Dress Code | ఇకపై టీచర్లు జీన్స్, టీషర్టులు వేసుకోవద్దు.. బీహార్ సర్కార్ సంచలన ఆదేశాలు!
Teachers Dress Code | పాఠశాలల్లో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఇకపై జీన్స్, టీషర్టులు ధరించి విధులకు హాజరుకాకూడదని బీహార్ ప్రభుత్వం ఆదేశించింది. తప్పనిసరిగా ఫార్మల్ దుస్తులు ధరించాలని స్పష్టం చేసింది. అ
Teachers Dress Code | పాట్నా : పాఠశాలల్లో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఇకపై జీన్స్, టీషర్టులు ధరించి విధులకు హాజరుకాకూడదని బీహార్ ప్రభుత్వం ఆదేశించింది. తప్పనిసరిగా ఫార్మల్ దుస్తులు ధరించాలని స్పష్టం చేసింది. అక్టోబర్ 30న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఫార్మల్ దుస్తులు తప్పనిసరి
బీహార్ విద్యాశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి (ఏసీఎస్) సీకే అనిల్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది విధులకు హాజరయ్యే సమయంలో తప్పనిసరిగా ఫార్మల్ దుస్తులు ధరించాలని సూచించారు. జీన్స్, టీషర్టులతో పాటు సాధారణ క్యాజువల్ దుస్తులను పాఠశాల ప్రాంగణాల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. గతంలోనూ ఈ విషయంలో సూచనలు చేసినప్పటికీ కొందరు ఉపాధ్యాయులు వాటిని పట్టించుకోవడం లేదని విద్యాశాఖ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో తాజా ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. విద్యాశాఖ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని మంత్రి మిథిలేష్ తివారీ అధికారులకు సూచించారు.
డీజేలు, డిస్కో డ్యాన్స్లపైనా నిషేధం
పాఠశాలల్లో క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణాన్ని కొనసాగించేందుకు విద్యాశాఖ మరికొన్ని ఆంక్షలు విధించింది. పాఠశాల ప్రాంగణాల్లో డీజేలు, డిస్కో డ్యాన్స్‌లు, విద్యా వాతావరణానికి విఘాతం కలిగించే ఇతర వినోద కార్యక్రమాలను నిర్వహించకూడదని ఆదేశించింది. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నిబంధనలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచించింది.
సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి
అయితే పాఠశాలల్లో సంగీతం, సాంస్కృతిక విద్యను పూర్తిగా నిషేధించడం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. సంప్రదాయ సంగీత బోధన, సంగీత వాయిద్యాల వినియోగానికి అనుమతి ఉంటుందని తెలిపింది. అకడమిక్ క్యాలెండర్లో పేర్కొన్న ప్రత్యేక రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని, అయితే అవి క్రమశిక్షణతో సాగాలని సూచించింది.
అమలుపై అధికారులకు బాధ్యతలు
తాజా ఆదేశాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కచ్చితంగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈవో)లను విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సిబ్బంది వస్త్రధారణ, పాఠశాలల్లో నిర్వహించే కార్యక్రమాలను పర్యవేక్షించాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో క్రమశిక్షణ, గౌరవప్రదమైన వాతావరణాన్ని పెంపొందించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని అధికారులు పేర్కొంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Munagaku | మునగాకుతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
AP News | చెన్నైకి 590 కిలోమీటర్ల దూరంలో అక్వాన్.. శుక్రవారం మధ్యాహ్నం తుపాను తీరం దాటే ఛాన్స్
రాజాపేటలో గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్
I hate Marriage Trailer | యూత్‌కు కనెక్ట్ అయ్యేలా.. ‘ఐ హేట్ మ్యారేజ్’ ట్రైలర్ విడుదల!
ఎంజీయూలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

