మాస్కో: ఉక్రెయిన్‌లోని అండర్‌గ్రౌండ్ మిస్సైల్ డిపోను రష్యా పేల్చేసింది. ఇవానో ఫ్రాంకివిక్ ప్రాంతంలో మిస్సైళ్లు, ఆయుధాలు ఉన్న స్థావరంపై రష్యా దాడి చేసింది. అయితే ఈ దాడి కోసం కిన్జాల్ హైపర్సోనిక్ మిస్సైల్‌ను రష్యా వాడింది. ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా తొలిసారి కిన్జాల్ ఏవియేషన్ మిస్సైల్‌ను వినియోగించినట్లు తెలుస్తోంది.
ధ్వనికన్నా వేగంతో కిన్జాల్ క్షిపణి ప్రయాణిస్తుంది. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న వేర్‌హౌజ్‌ను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ కార్యాలయం పేర్కొన్నది. ఇవానో ఫ్రాంకివిక్ ప్రాంతంలోని డెలియటిన్ గ్రామంలో ఆ మిస్సైళ్ల డిపో ఉంది.