కీవ్: బిడ్డ ఎక్కడున్నా బతికుంటే చాలనుకొన్నది ఉక్రెయిన్‌లోని ఓ మాతృమూర్తి. ఈ క్రమంలో ప్రేమపాశాన్ని కూడా కాదనుకొన్నది. అందుకే కల్లోల ఉక్రెయిన్ నుంచి 11 ఏండ్ల కొడుకును వెయ్యి కిలోమీటర్ల దూరంలోని స్లొవేకియా దేశానికి రైలెక్కించింది. బిడ్డ తప్పిపోకూడదని అక్కడి బంధువుల ఫోన్ నంబర్‌ను బాలుడి చేతిపై రాసింది. స్లొవేకియా చేరుకొన్న బాలుడి నుంచి విషయం తెలుసుకొన్న అధికారులు బంధువులకు అతన్ని అప్పగించారు. ఉక్రెయిన్‌లో పరిస్థితులకు ఇదో సజీవసాక్ష్యం.