మాస్కో : ఉక్రెయిన్‌తో యుద్ధంలో పాల్గొనడానికి తిరస్కరించే సైనికులను రష్యన్ కమాండర్లు చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు వెర్స్ట్కా అధ్యయనం వెల్లడించింది. రష్యన్ సైనికులు, మృతుల బంధువులు, లీక్ అయిన వీడియోలు, అధికారిక ఫిర్యాదుల రికార్డులను పరిశీలించినపుడు 101 మంది రష్యన్ సర్వీస్‌మెన్ ఈ దారుణాలకు పాల్పడినట్లు తెలిసింది.
150 మరణాలపై తాము పరిశోధన చేశామని ఈ సంస్థ వెల్లడించింది. వాస్తవంగా మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చునని పేర్కొంది.