RUSSIA E-VISA| న్యూఢిల్లీ: రష్యాలో పర్యటించాలనుకునే భారతీయులకు శుభవార్త. వీసా జారీ ప్రక్రియను రష్యా సులభతరం చేయనుంది. భారత పాస్పోర్ట్ ఉన్న వారికి ఆగస్టు 1 నుంచి ఈ-వీసాలను జారీచేయనున్నట్టు ప్రకటించింది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ఇకపై ఆన్లైన్లోనే వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నిర్ణయం ఇరుదేశాల మధ్య పర్యాటకానికి ఊతమిస్తుందని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసిన నాలుగు పనిదినాల్లోగా ఈ-వీసాను ప్రాసెస్ చేయనున్నారు. అప్లికేషన్ ఫీజు 40 డాలర్లు. ఆన్లైన్లోనే దీన్ని చెల్లించొచ్చు.
60 రోజుల పాటు ఈ-వీసా చెల్లుబాటు అవుతుంది. బిజినెస్ ట్రిప్, గెస్ట్ విజిట్స్, టూరిజం కోసం ఈ-వీసాలను ఉపయోగించుకోవచ్చు. ఇండియాతోపాటు చైనా, బ్రెజిల్, మెక్సికో, సౌత్ ఆఫ్రికా తదితర 52 దేశాలకు రష్యా ఈ-వీసా సౌకర్యాన్ని అందిస్తున్నది. ఆన్లైన్లోనే దరఖాస్తు, ప్రాసెసింగ్ చేసే వీసాలను ఈ-వీసాలు అంటారు