సర్మత్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని రష్యా విజయవంతంగా ప్రయోగించింది. భూమి మీద ఉన్న ఏ టార్గెట్ అయినా దీంతో ఛేదించవచ్చని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తున్న సమయంలోనే రష్యా ఈ సర్మత్‌ను ప్రయోగించింది. దీని ద్వారా శత్రువులను భయపెట్టడానికేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకరమైన మిస్సైల్ అని రష్యా ప్రకటించింది. సర్మత్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి గురించి మరికొన్ని ముచ్చట్లు..
1. ఖండాంతర బాలిస్టిక్ మిస్పైల్. న్యూక్లియర్ బాంబులను తీసుకెళ్లి ప్రయోగించవచ్చు
2. ఇరవై రెండేండ్లుగా దీన్ని అభివృద్ధి చేసేందుకు రష్యా కష్టపడుతోంది.
3. యాంటి మిస్సైల్ రక్షణ వ్యవస్థ కూడా దీన్ని పసిగట్టలేదు. మిస్సైల్ లాంచ్ చేయగానే బూస్ట్ ఫేజ్ వుంటుంది. దీన్ని వల్ల శత్రు దేశాలు ట్రేస్ చేయడం చాలా కష్టం.
4. 200 టన్నులుండే ఈ మిస్సైల్‌లో ఒకటి కంటే ఎక్కువ వార్ హెడ్స్ ను పంపొచ్చు. దీంతో భూమి మీద వున్న ఏ టార్గెట్ అయినా ఛేదించవచ్చు.
5. ప్రపంచంలో అత్యంత విధ్వంసకర మిస్సైల్‌గా దీన్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
6. ఉత్తర రష్యాలోని పెసెట్స్ కాస్మోడ్రోమ్‌లో ఈ క్షిపణి పరీక్ష జరిగింది.
7. క్షిపణి పొడవు 36 మీటర్లు. వెడల్పు 3 మీటర్లు. బరువు 200 టన్నులు
8. గంటకు 25,000 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకెళ్తుంది.