సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన దేశాల్లో పాశ్చాత్య దేశాలు మిలటరీ స్థావరాలు ఏర్పాటు చేయకూడదని రష్యా తేల్చిచెప్పింది. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గే లావరోవ్ చెప్పినట్లు సమాచారం. రష్యాకు చెందిన కొన్ని వార్తా సంస్థలు ఈ వార్తలను ప్రచురించాయి. అలాగే కొన్ని యూరప్ దేశాల్లో అమెరికాకు చెందిన న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయని, అలాంటి వాటినే ఉక్రెయిన్‌లో కూడా ఉంచే ప్రమాదాన్ని నివారించడానికి చర్యలు తీసుకుంటున్నామని లావరోవ్ అన్నారట.
కాగా, యూరోపియన్ యూనియన్, రష్యాకు వ్యతిరేకంగా ఏర్పాటైన నాటోలో చేరేందుకు ఉక్రెయిన్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దీంతోనే ఉక్రెయిన్‌పై రష్యా గుర్రుగా ఉంది. తాజాగా ఉక్రెయిన్‌కు ఈయూలో సభ్యత్వాన్ని ఆమోదిస్తున్నట్లు యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. దీనిపై రష్యా ఎలా స్పందిస్తుందో చూడాలి.