కీవ్: రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య సుదీర్ఘ యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. ఉక్రెయిన్లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని నిత్యం రష్యా మెరుపు దాడులకు పాల్పడుతున్నది. తాజాగా శుక్రవారం ఉదయం జపోరిఝ్ఝియా నగరంపై రష్యా మెరుపుదాడులు చేసింది. జపోరిఝ్ఝియాలోని ఇందన సదుపాయాలు లక్ష్యంగా రష్యన్ సేనలు మిస్సైల్లతో విరుచుకుపడ్డాయి. కేవలం గంట వ్యవధిలో 17 సార్లు ఉక్రెయిన్లోని ఇంధన కేంద్రాలపై క్షిపణుల వర్షం కురిపించాయి.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైన దగ్గరి నుంచి రష్యా గంట వ్యవధిలో 17 సార్లు మిస్సైల్ దాడులకు పాల్పడటం ఇదే మొదటిసారని జపోరిఝ్ఝియా సిటీ కౌన్సిల్ సెక్రెటరీ అనతోలి కుర్టీవ్ తెలిపారు. జపోరిఝ్ఝియాపై దాడికి ముందు రష్యా సేనలు ఖార్ఖీవ్పై కూడా దాడి చేశాయని ఆ నగర మేయర్ ఐహర్ తెరెకోవ్ చెప్పారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 4.00 గంటలకు ఖార్ఖీవ్పై దాడి జరిగిందన్నారు.