Russia | రష్యా(Russia attack) ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు దేశాలు పరస్పర దాడులతో పలువురు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున రష్యా ఉక్రెయిన్‌పై(Ukraine) మరోసారి డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రాత్రికి రాత్రే భారీ క్షిపణి, డ్రోన్ దాడి చేసింది. దీంతో నగరం అంతటా పేలుళ్లు సంభవించాయి. ఉక్రెయిన్‌లోని రెండో అతి పెద్ద నగరమైన ఖార్కిప్ను లక్ష్యంగా చేసుకొని భీకర దాడులకు పాల్పడింది.
ఈ దాడుల వల్ల శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి, అనేకచోట్ల మంటలు చెలరేగాయి. ఖార్కిప్తో పాటు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 6గురు మృతి చెందారు. ఇందులో 15 ఏండ్ల బాలుడు మృతి చెందినట్లు సమాచారం. 50 మందికి పైగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. అలాగే ఒడెస్సా ప్రాంతంలో బాలిస్టిక్ క్షిపణితో దాడి చేయగా ఇద్దరు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్‌పై మళ్లీ దాడులు జరిగే అవకాశం ఉందని ఆదేశాధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించిన కొద్ది గంటల్లోనే దాడులు జరగడం గమనార్హం.