మాస్కో: తీవ్ర ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో రష్యా కొత్త తరహా లావాదేవీలకు తెరలేపినట్లు తెలుస్తోంది. ముడి చమురు కొనుగోలుకు బిట్కాయిన్లు స్వీకరించేందుకు రష్యా ఆసక్తిగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తమ వద్ద ఉన్న ఆయిల్, గ్యాస్‌ను అమ్మేందుకు.. కొన్ని దేశాల నుంచి రష్యా బిట్కాయిన్లను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రష్యాకు చెందిన ఉన్నతాధికారులు ఈ విషయాన్ని చెప్పారు. మిత్రదేశాలకు రష్యా మరో ఆఫర్ కూడా ఇస్తున్నట్లు వార్తలు వ్యాపిస్తున్నాయి. స్థానిక కరెన్సీలను సమర్పించినా.. మిత్రదేశాలకు ఆయిల్ ఇవ్వనున్నట్లు రష్యా అధికారి పావెల్ జవాల్నీ తెలిపారు. ఒకవేళ మిత్రకూటమిలో లేని దేశాలు తమ వద్ద ఆయిల్ కొనాలనుకుంటే అప్పుడు ఆ దేశాలు రూబుల్స్ రూపంలో చెల్లింపులు చేయాలని ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. రష్యా కరెన్సీ రూబుల్‌కు పూర్వ వైభావాన్ని తీసుకువచ్చేందుకు ఆ దేశం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై వార్‌కు వెళ్లిన రష్యా ఈ ఏడాది 20 శాతం తన కరెన్సీ విలువ కోల్పోయింది.