కీవ్ : ఉక్రెయిన్, రష్యా యుద్ధం భీకరంగా సాగుతున్నాయి. రాజధాని కైవ్, ఖార్కివ్ నగరాల్లో రష్యన్ సైన్యం విధ్వంసం సృష్టించింది. నివాస ప్రాంతాలతో పాటు ఆసుపత్రుల వద్ద పేలుళ్లు జరిగాయి. సైనిక చర్యలు ప్రారంభమై ఎనిమిది రోజులు కావొస్తున్నా ఉక్రెయిన్ లొంగకపోవడంతో రష్యా ఇప్పుడు ఆర్థిక మూలాలపై దెబ్బతీస్తున్నది. ఇందులో భాగంగా చెర్నిహివ్ ఆయిల్ డిపోపై రష్యా మిస్సైల్స్‌తో దాడి చేసింది.
గత వారం రోజుల్లోనే ఉక్రెయిన్ జనాభాలో రెండు శాతం మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పొరుగుదేశాలకు వలస వెళ్లారు. ఖార్కివ్ నుంచి ఇప్పటికీ ఇంకా వలసలు కొనసాగుతున్నాయి. రోజంతా బాంబు పేలుళ్లు, ఉద్రిక్తతల మధ్య జనం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితి సొంతింటి, దేశాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైల్వేస్టేషన్ల వద్ద రద్దీగా ఎక్కువగా ఉన్నది. రైళ్లలో సరిహద్దు ప్రాంతాలకు వెళ్తున్నారు. రష్యా దాడిలో 500 మందికిపైగా సైనికులు మరణించారు.
ఐక్యరాజ్య సమితి రష్యా యుద్ధం ఆపాలని పెట్టిన తీర్మానానికి చాలా దేశాలు మద్దతు తెలుపుతూ ఓటు వేశాయి. మరో వైపు రష్యా ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో బాంబు దాడులు తిరిగి ప్రారంభించింది. ఇదే సమయంలో వ్యూహాత్మక ఓడరేవులను సైతం చుట్టుముట్టింది. గతవారం ప్రారంభమైన సైనిక చర్యలో 500 మంది సైనికులు మృతి చెందారని, 1600 మంది గాయపడ్డారని రష్యా పేర్కొంది. మాస్కో దాడిలో 2వేల మంది పౌరులు మరణించారని ఉక్రెయిన్ పేర్కొంది.