మాస్కో : గత శనివారం క్రిమియా వంతెనపై పేలుడు ఘటనలో ఐదుగురు రష్యన్లు, ముగ్గురు ఉక్రెయిన్, అర్మేనియా పౌరులను అరెస్టు చేసినట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSB) బుధవారం తెలిపింది. ఉక్రేనియన్ మిలటరీ ఇంటెలిజెన్స్, దాని డైరెక్టర్ నిర్వహించినట్లు ఎఫ్ఎస్బీ ఆరోపించింది. పేలుడుకు వినియోగించిన పరికరాలు ఉక్రెయిన్ నుంచి బల్గేరియా, జార్జియా, అర్మేనియా మీదుగా రష్యాకు తరలించినట్లు పేర్కొంది. ఎఫ్ఎస్బీ మాస్కో, పశ్చిమ రష్యా నగరమైన బ్రయాన్స్క్లో ఉక్రెయిన్ దాడులను నిరోధించిందని పేర్కొంది. గత శనివారం రష్యా – క్రిమియాను కలిపే వంతెనపై పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిపింది.
ఆ సమయంలో వెళ్తున్న వాహనాలకు, రైలులోని ఇంధన ట్యాంకర్లు ధ్వంసమయ్యాయి. 2018లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగతంగా ప్రారంభించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన ఈ వంతెన, దక్షిణ ఉక్రెయిన్లో పోరాడుతున్న రష్యన్ దళాలకు సామగ్రి సరఫరా చేయడంలో కీలకంగా ఉన్నది. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ రష్యా.. ఆ తర్వాత పలు ఉక్రెయిన్ నగరాలపై బాంబులతో విరిచుకుపడింది. చాలా భవనాలు నేలమట్టం కాగా.. మరికొన్ని పాక్షికంగా ధ్వంసమయ్యాయి. పలువురు ఉక్రేనియన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, క్రిమియా వంతెనపై పేలుడు ఘటనలో ఉక్రేయిన్ తన ప్రేమయంపై స్పందించలేదు. కానీ, ఆ దేశానికి చెందిన అధికారులు మాత్రం సంబురాలు నిర్వహించారు.