గోమెల్: ఉక్రెయిన్పై దాడికి వెళ్లిన రష్యాకు భారీ నష్టం సంభవించింది. అధిక సంఖ్యలో రష్యా సైనికులు మృతిచెందారు. ఇక గాయపడ్డవారు కూడా ఎక్కువే ఉన్నారు. బెలారస్ను అడ్డగా మార్చుకుని కొంత రష్యా సైన్యం దాడికి దిగిన విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్ ఫ్రంట్లైన్లో గాయపడ్డ రష్యా సైనికులు బెలారస్కు చేరుకుంటున్నారు. సోమవారం నుంచి భారీ సంఖ్యలో రష్యా మిలిటరీ అంబులెన్సులు బెలారస్కు క్యూకట్టినట్లు తెలుస్తోంది. గోమెల్ ప్రాంతంలో ఉన్న వైద్య కేంద్రానికి రష్యా మిలిటరీ అంబులెన్సులు కాన్వాయ్ రూపంలో వెళ్తున్నట్లు స్థానికులు గమనించారు. ధీటుగా ఉక్రెయిన్ బదులిస్తున్న నేపథ్యంలో వేల సంఖ్యలోనే రష్యా తన సైనికుల్ని కోల్పోతోంది. అయితే గాయపడ్డవారిని అంబులెన్సుల్లో బెలారస్కు తరలిస్తోంది. అంబులెన్సులోని అద్దాలకు గ్రే కలర్ స్టిక్కర్ వేసి వాటిల్లో సైనికుల్ని తీసుకువెళ్తున్నారు.