మాస్కో: కీలకమైన వడ్డీ రేటును రష్యా రెండింతలు పెంచేసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రష్యా కరెన్సీ రబుల్ 30 శాతం పడిపోయింది. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ రష్యా ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నది. వడ్డీ రేటును 9.5 శాతం నుంచి 20 శాతానికి పెంచినట్లు బ్యాంక్ పేర్కొన్నది. దేశ కరెన్సీ మరింత పతనం కాకుండా ఉండేందుకు రష్యా ఈ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. బ్యాంక్ ఆఫ్ రష్యాతో బ్రిటన్, అమెరికా, ఈయూ దేశాల బ్యాంకులు సంబంధాలు తెంచుకోవడంతో రబుల్కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రష్యా బ్యాంక్‌తో లావాదేవీలను నిలిపివేసేలా తక్షణమే చర్యలు చేపడుతున్నట్లు బ్రిటన్ తెలిపింది. స్విఫ్ట్ ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్ నుంచి రష్యాను బ్యాన్ చేయడం వల్ల ఆ దేశ కరెన్సీ పతనమవుతోంది. కరెన్సీ విలువ మరింత పడిపోకుండా ఉండేందుకు.. ద్రవ్యోల్బణాన్ని నివారించేందుకు రష్యా వడ్డీ రేట్లను పెంచినట్లు స్పష్టమవుతోంది. దేశంలోని కంపెనీలు 80 శాతం విదేశీ మారక నిలువలను అమ్మేయాలని రష్యా ఆదేశించింది. గ్లోబల్ మార్కెట్ నుంచి రష్యా ఒంటరి అవుతోందని కొందరు నిపుణులు అంటున్నారు. ఆయిల్, గ్యాస్ ఎగుమతి చేసే రష్యా .. ఎక్కువగా స్విఫ్ట్ సిస్టమ్‌పై ఆధారపడుతోంది.