నాలుగు నగరాల్లో రష్యా కాల్పుల విరమణ
ceasefire | ఉక్రెయిన్లో బాంబుల మోత మోగిస్తున్న రష్యా మరోసారి కాల్పుల విరమణ (ceasefire) ప్రకటించింది. నాలుగు నగరాల్లో పౌరులను తరలించేందుకు వీలుగా సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి
హైదరాబాద్: ఉక్రెయిన్లో బాంబుల మోత మోగిస్తున్న రష్యా మరోసారి కాల్పుల విరమణ (ceasefire) ప్రకటించింది. నాలుగు నగరాల్లో పౌరులను తరలించేందుకు వీలుగా సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం) కాల్పులు విరమిస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.

రష్యన్ బలగాలు ఉధృతంగా దాడులు జరుపుతున్న కీవ్, ఖార్కివ్, మరియుపోల్, సుమీ పట్టణాల్లో కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని తెలిపింది. హ్యుమానిటేరియన్ కారిడార్ ఏర్పాటు అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించింది. కాగా, మరియుపోల్లో రష్యా సైన్యం కాల్పుల విరమణ ప్రకటించడం ఇది రెండోసారి. అయితే కొద్దిసేపటికే కాల్పులు ప్రారంభించడంతో పౌరుల తరలింపును అధికారులు నిలిపివేశారు.

Russian military declares ceasefire in Ukraine from 0700 GMT to open humanitarian corridors at French President Emmanuel Macron's request: Sputnik
— ANI (@ANI) March 7, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Ceasefire
- Evacuation
- Kharkiv
- Kyiv
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

