లండన్: ఉక్రెయిన్‌లో ఫాస్పరస్ బాంబులతో రష్యా దాడులు చేసే అవకాశం ఉందని బ్రిటన్ హెచ్చరించింది. మారియపోల్ నగరంలో రష్యా ఆ బాంబులను వాడే ఛాన్సు ఉన్నట్లు బ్రిటన్ అంచనా వేసింది. బ్రిటన్ రక్షణ మంత్రి దీని గురించి వివరణ ఇచ్చారు. నిజానికి ఇప్పటికే డోనస్కీ ప్రాంతంలో ఆ రకమైన బాంబులను వాడినట్లు ఆ మంత్రి వెల్లడించారు. ఫాస్పరస్ బాంబులు అత్యంత ప్రమాదకరమైనవి. ఆ బాంబులు తీవ్రమైన గాయాల్ని చేస్తాయని హ్యూమన్ రైట్స్ వాచ్ చెబుతోంది. ఫాస్పరస్ బాంబులు శరీరంలో అగ్నిని పుట్టిస్తాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఫాస్పరస్ బాంబులను పట్టణ ప్రదేశాల్లో వాడడం నిషేధం. ఫాస్పరస్ బాంబును ప్రయోగించిన సమయంలో.. వైట్ ఫాస్పరస్ ఆక్సిజన్‌తో కలిసి అంటుకుంటుందని, అది కొవ్వులో త్వరగా కరుగదని, దీని వల్ల మానవుల మాంసం కాలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం డోనస్కీ, లుహాంస్క్ ప్రాంతాల్లో భీకర కాల్పులు జరుగుతున్నట్లు కూడా బ్రిటన్ చెప్పింది.