మాస్కో: రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌కు చెందిన 1053 సైనిక కేంద్రాలను తమ దళాలు అటాక్ చేసినట్ల రష్యా పేర్కొన్నది. రాత్రికి రాత్రే ఈ దాడి జరిగినట్లు రష్యా వెల్లడించింది. టెలిగ్రామ్ అప్డేట్లో రక్షణశాఖ ఈ విషయాన్ని చెప్పింది. ఉక్రెయిన్‌కు చెందిన 106 ఆర్టిల్లరీ ఫైరింగ్ పొజిషన్స్‌తో పాటు ఆరు పైలెట్ రహిత విమానాలను కూల్చినట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్‌కు చెందిన 73 మిలిటరీ సంస్థలపై తమ దళాలు ఫైరింగ్ చేసినట్లు రష్యా పేర్కొన్నది.
హై ప్రిషిషన్ మిస్సైల్ దాడి వల్ల 40 మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందినట్లు రష్యా తెలిపింది. ఏడు మిలిటరీ ఈక్విప్మెంట్ యూనిట్లను కూడా ధ్వంసం చేశారు. ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక ఆపరేషన్ కొనసాగుతున్నట్లు రష్యా సాయుధ బలగాల ఫెడరేషన్ పేర్కొన్నది.