Russia-Ukraine | ఉక్రెయిన్ పై డ్రోన్లు, క్షిపణులతో రష్యా దాడులు.. నలుగురు మృతి
Russia-Ukraine : రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్ పై రష్యా మరోసారి దాడి చేసింది. భారీగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకపడింది. అందులోనూ ఆధునిక ఒరెష్నిక్ హైపర్ సోనిక్ క్షిపణులతో రాష్యా దాడి చేసింది.
Russia-Ukraine : రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్ పై రష్యా మరోసారి దాడి చేసింది. భారీగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకపడింది. అందులోనూ ఆధునిక ఒరెష్నిక్ హైపర్ సోనిక్ క్షిపణులతో రాష్యా దాడి చేసింది. మొత్తం 36 మిస్సైల్స్ 242 డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడుల్లో నలుగురు మరణించినట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. ఈ వైమానిక దాడి ఈయూ-నాటో దేశాల సరిహద్దు ప్రాంతంలో జరగడం విశేషం.
ఈ దాడులపై రష్యా అధికారికంగా వెల్లడించింది. ఉక్రెయిన్ లోని వ్యూహాత్మక ప్రాంతాలపై శుక్రవారం అర్ధరాత్రి తమ సైన్యం దాడి చేసిందని ప్రకటించింది. మరోపక్క ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కోసం ప్రయత్నాలు జరుగుతుండగా.. రష్యా ఈ దాడులు చేసింది. శాంతి ఒప్పందం విషయంలో ఉక్రెయిన్ చేసిన తాజా ప్రతిపాదనను రష్యా తిరస్కరించింది. తాజా దాడుల్ని ఉక్రెయిన్ ఖండించింది. శాంతి ఒప్పందం గురించి చర్చిస్తున్న సమయంలో దాడులు సరికాదని పేర్కొంది. రష్యా తాజా దాడి కారణంగా ఉక్రెయిన్ లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
దాదాపు 5.5 లక్షల మంది చీకట్లోనే మగ్గుతున్నారు. అందులోనూ చలి తీవ్రత పెరుగుతున్న సమయంలో ఈ పరిస్తితి తలెత్తడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత నెలలో పుతిన్ నివాస స్థలంపై ఉక్రెయిన్ దాడి చేసిన సంగతి తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

