Vladimir Putin | మాస్కో, మే 3: పుతిన్‌ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ ప్రయత్నించిందని, డ్రోన్ల ద్వారా చేసిన వారి ప్రయత్నాన్ని తాము అడ్డుకుని వాటిని కూల్చేశామని రష్యా ప్రకటించింది. ఈ చర్యను ఉగ్ర దాడిగా పేర్కొన్న క్రెమ్లిన్.. దానికి తగినట్టు బదులు తీర్చుకుంటామని హెచ్చరించింది.
క్రెమ్లిన్ భవనంపై జరిగిన ఈ దాడి యత్నంలో పుతిన్‌కు ఎలాంటి గాయాలు కాలేదని, భవనం, ఇతర వస్తువులూ దెబ్బ తినలేదని తెలిపింది. మానవ రహిత రెండు డ్రోన్లు ఈ దాడిలో పాల్గొన్నాయని ఆ దేశ అధికార ప్రతినిధి మిక్యాలో పొడోలియక్ తెలిపారు. ఈ ఆరోపణలను ఉక్రెయిన్ ఖండించింది.