నైపేయీ: మయన్మార్ తీర ప్రాంతంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. రొహింగ్యా శరణార్థులతో వెళ్తున్న రెండు ఓడలు మునిగిపోయాయి. ఈ ఘోర దుర్ఘటనల్లో సుమారు 427 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని ఐక్యరాజ్యసమితి(ఐరాస) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఐరాస ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ నెల 9న, 10న రెండు ఓడలు నీట మునిగాయి. ఈ రెండు ఘటనల్లో కలిపి మొత్తం 427 మంది మరణించి ఉండవచ్చునని ఐరాస అంచనా వేస్తున్నది.