బీజింగ్, డిసెంబర్ 8: చైనాలో ట్రాఫిక్ నియంత్రణకు సరికొత్త విధానం అమల్లోకి వచ్చింది. కూడళ్లలో వాహనాల రద్దీని నియంత్రించేందుకు అధికారులు రోబో ట్రాఫిక్ పోలీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏఐ టెక్నాలజీతో పనిచేసే రోబో పోలీస్… వాహనదారులకు తగిన సూచనలు, హెచ్చరికలు చేస్తుంది. ఎవరైనా తన మాట వినకపోతే సమీపంలో ఉన్న పోలీసులను రోబో అలర్ట్ చేస్తుంది. దీంతో వారు అక్కడికి చేరుకుని చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే చైనాలోని టెక్నాలజీ హబ్ అయిన పై రోబో ట్రాఫిక్ పోలీస్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చైనా మీడియాలో ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన హ్యూమనాయిడ్ రోబో పోలీస్ చర్చనీయాంశంగా మారింది.1.8 మీటర్ల ఎత్తు కలిగిన రోబో అచ్చంగా నిజమైన ట్రాఫిక్ పోలీస్ తరహాలోనే రద్దీ రోడ్లపై నిల్చుకుని వాహనదారులకు సూచనలు ఇస్తుంది.