Violence @ Paris | పారిస్‌లో హింసాత్మకంగా మారిన అల్లర్లు.. పలువురు పోలీసులకు గాయాలు
Violence @ Paris | పారిస్‌లో అల్లర్లు హింసాత్మకంగా మారాయి. పలు ప్రాంతాల్లో ఆందోళనాకారులు దాడులకు పాల్పడటంతో వాహనాలు, చిన్న దుకాణాలు ధ్వంసమయ్యాయి. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది.
Violence @ Paris | పారిస్‌లో అల్లర్లు హింసాత్మకంగా మారాయి. అల్లర్లు ఆదివారం కూడా కొనసాగాయి. ఈ అల్లర్లలో పలువురు పోలీసులు గాయపడ్డారు. పలు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. శుక్రవారం పారిస్‌లో కుర్దీష్ కమ్యూనిటీపై జాతి వివక్షతో జరిగిన దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అప్పటి నుంచి పారిస్ అంతటా అల్లర్లు కొనసాగుతున్నాయి.
ఆందోళనలు జరుగుతున్న రిపబ్లిక్ స్క్వేర్ సమీపంలో మంటలు చెలరేగాయి. నిరసనలు అకస్మాత్తుగా ఎలా హింసాత్మకంగా మారాయో అంతుపట్టడం లేదని పారిస్ పోలీస్ చీప్ లారెంట్ నునెజ్ చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం ప్రారంభమైన హింసాత్మక నిరసనల్లో పాల్గొన్న 11 మందిని అరెస్టు చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనాకారులను చెదరగొట్టారు. ఈ నిరసనల్లో ఇప్పటివరకు 30 మంది పోలీసులు, ఒక నిరసనకారుడు గాయపడ్డారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టడానికి ముందు 2 గంటలపాటు ఆందోళనలు కొనసాగాయి.
నిరసనల్లో పారిస్ 10 వ జిల్లా మేయర్ సహా పలువురు రాజకీయ నాయకులతో కలిసి వందలాది మంది కుర్దిష్ నిరసనకారులు జెండాలు చేతబూని చనిపోయిన వారికి నివాళులర్పించారు. గత పదేండ్లలో ఆరుగురు కుర్దిష్ కార్యకర్తలు పారిస్ నడిబొడ్డున పట్టపగలు హత్యకు గురయ్యారని, మాకు పారిస్‌లో ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని ఓ నిరసనకారుడు చెప్పాడు. ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకే ఆందోళన చేపట్టామని ఆయన తెలిపాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

