టెహ్రాన్: ఇడిన అంతరాన్లో ఏర్పర్యుద్ధంలో విదేశాల నుంచి తన ప్రకటనల ద్వారా రెచ్చగొట్టి ఖమేనీ ప్రభుత్వంపైకి పౌరులను ఎగదోసిన బహిష్కృత ఇరాన్ మాజీ యువరాజు, ప్రవాస నివాసి రెజా పహ్లావి తాజా యుద్ధ పరిణామాల మధ్య మరోసారి ప్రజలకు సందేశాన్ని అందజేశారు.
ఇది నిర్ణయాత్మక దశ అని, దానికి పౌరులందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ‘ఇరాన్ ప్రజలకు తాను సహాయపడతానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వాగ్దానం అమలు చేసే క్షణాలు మన ముందు ఉన్నాయి. ఇది మానవత్వ జోక్యం. ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వ యంత్రాంగం, అణచివేత యంత్రాంగమే ఆయన లక్ష్యం.’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ జోక్యంతో అంతిమ విజయం మనది కానున్నదని ఆయన అన్నారు.