టొరంటో: ఇటీవల భారత్-కెనడా మధ్య ఏర్పడిన దౌత్య ప్రతిష్టంభనతో కెనడాలో నిలిపివేసిన వీసా సేవలలో కొన్నింటిని గురువారం నుంచి పునరుద్ధరిస్తున్నట్టు భారత్ బుధవారం ప్రకటించింది. కెనడా ప్రభుత్వం ఇటీవల చేసిన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై సమీక్షించిన అనంతరం ఇంచుమించు నెల రోజుల తర్వాత ఈ నెల 26 నుంచి ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసా సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్టు ఒట్టావాలోని భారత హై కమిషన్ కార్యాలయ ప్రతినిధి తెలిపారు.