Bangladesh | బంగ్లాదేశ్‌లో రిటైర్డ్ హిందూ టీచర్ కుటుంబం అనుమానాస్పద మృతి
Bangladesh : బంగ్లాదేశ్‌లో ఒక హిందూ కుటుంబం అనుమానాస్పదంగా మరణించింది. ఈ ఘటనతో స్తానిక హిందువులు మరోసారి ఉలిక్కిపడ్డారు. మృతుల్లో ఒక రిటైర్డ్ టీచర్, అతడి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Bangladesh : బంగ్లాదేశ్‌లో ఒక హిందూ కుటుంబం అనుమానాస్పదంగా మరణించింది. ఈ ఘటనతో స్తానిక హిందువులు మరోసారి ఉలిక్కిపడ్డారు. మృతుల్లో ఒక రిటైర్డ్ టీచర్, అతడి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన బంగ్లాదేశ్, రంగ్‌పూర్ మెట్రోపాలిటన్ కొత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి స్తానిక మీడియా, బంధువులు తెలిపిన వివరాలివి.
గణపతి చక్రవర్తి (65) అనే వ్యక్తి రంగ్‌పూర్ జిల్లా స్కూల్ టీచర్‌గా పని చేసి, గత ఏడాది డిసెంబర్ 31న రిటైర్ అయ్యారు. ఆయన ఇటీవలే సొంత ఇల్లు నిర్మించుకుని, భార్య ప్రీతిలతా చక్రవర్తి (50), కూతురు అగామి చక్రవర్తి ప్రార్థి (23), కొడుకు ప్రియం చక్రవర్తి (12)తో కలిసి ఉంటున్నాడు. పిల్లల్లో అగామి ఇటీవలే ఇంగ్లీష్‌లో మాస్టర్స్ పూర్తి చేయగా, కొడుకు ఐదో తరగతి చదువుతున్నాడు. వీరి కుటుంబానికి స్తానికులతో, ఎవరితో ఎలాంటి విబేధాలు లేవు. అనుమానించదగ్గ శతృవులు కూడా లేరు. గణపతి చక్రవర్తి కుటుంబంతో బంధువులు చివరగా గత గురువారం ఫోన్లో మాట్లాడారు.
ఆ తర్వాత నుంచి ఆ కుటుంబంలోని నలుగురి ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయి. దీంతో చాలాసార్లు ఫోన్ చేసినా.. ఎవరూ స్పందించలేదు. చివరకు శనివారం సాయంత్రం ప్రీతిలత సోదరి వారి ఇంటికి వచ్చింది. అప్పటికి ఇల్లు పూర్తిగా లాక్ చేసి ఉంది. గేట్లు వేసి ఉన్నాయి. ఇంటి లోపల నుంచి తలుపులు గొల్లెం పెట్టుకుని ఉన్నారు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. వారు వచ్చి తలుపులు బద్ధలుకొట్టి చూడగా.. ఇంట్లో నలుగురు మరణించి ఉన్నారు. పై కప్పు మీద గణపతి, మెట్లమీద ప్రీతిలత, అగామి మరణించి ఉండగా, కొడుకు ప్రియం మృతదేహం బెడ్‌పై పడి ఉంది.
దీంతో గణపతి బంధువులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాల్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. వారి మరణానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో విచారిస్తున్నారు. తమ వారిది హత్యే అని, నిందితులపై చర్యలు తీసుకోవాలని గణపతి బంధువులు కోరుతున్నారు. అయితే, ఈ ఘటనతో స్తానిక హిందువుల్లో మరోసారి కలకలం రేగింది. గతేడాది బంగ్లాదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో హిందువులపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

