లండన్: ఆత్మహత్యల నివారణలో భాగంగా పారాసిటమాల్ ట్యాబ్లెట్ల కొనుగోళ్లపై ఆంక్షలు విధించాలని బ్రిటన్ ప్రభుత్వం యోచిస్తున్నది. ప్రస్తుతం ఆ దేశంలో ఒక్కో వ్యక్తి 16 ట్యాబ్లెట్లు ఉండే 500 ఎంజీ రెండు ప్యాకెట్లు మాత్రమే కొనుగోలు చేసేందుకు అనుమతి ఉన్నది. దీనిపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంది. బ్రిటన్లోని చాలామంది విద్యార్థులు ఈ ట్యాబ్లెట్లను ఆత్మహత్యలు చేసుకునేందుకు వినియోగిస్తున్నట్టు కేమ్బ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ నివేదికలో పేర్కొన్నది. ఈ ట్యాబ్లెట్ను మోతాదుకు మించి వాడడం వల్ల కాలేయం దెబ్బతిని ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అందులో తెలిపింది. దీంతో ప్రభుత్వం ఆంక్షలు తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తున్నది.